ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:32 IST)

రికార్డు స్థాయికి చమురు ధరలు.. మళ్లీ పెట్రో మంట

అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో ఆయిల్ కంపెనీలు మాత్రం పెట్రో ధరలను పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 
 
రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కి చేరగా డీజిల్ ధర రూ.90.17కి పెరిగింది.
 
తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.84కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగి రూ.106కు చేరగా, డీజిల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.99.08కు పెరిగింది.
 
ఇక ప్రధాన నగరాలైన కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.17, డీజిల్‌ రూ.92.97, చెన్నైలో పెట్రోల్‌ రూ.99.36, డీజిల్‌ రూ.94.45, బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.44, డీజిల్‌ రూ.95.70కు చేరాయి.