శుక్రవారం, 16 జనవరి 2026
  1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. సెన్సెక్స్
Written By PNR
Last Updated : మంగళవారం, 3 జూన్ 2014 (18:17 IST)

ఆర్బీఐ నిర్ణయం.. సెన్సెక్స్ దూకుడు!

కీలక వడ్డీ రేట్లను మార్పు చేయకుండా భారతీయ రిజర్వు బ్యాంకు యధాతథంగా ఉంచడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 24,859కి చేరుకుంది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 7,416కి చేరుకుంది. 
 
ఈ ట్రేడింగ్‌లో హావెల్స్ ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, టాటా స్టీల్, ఎస్ఎస్ఎల్టీ తదితర కంపెనీల షేర్లు లాభాలను స్వీకరించగా, ఎంఫాసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, వోక్ హార్డ్ లిమిటెడ్, శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.