శనివారం, 7 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జూన్ 2014 (17:55 IST)

ఇరాక్ ప్రభావం: కుప్పకూలిన బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ వారంతమైన శుక్రవారం నష్టాలతో ముగిసింది. ఇరాక్‌లో చెలరేగిన హింస బాంబే స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. మేజర్ ఆయిల్ సరఫరాదారుల్లో ఒకటైన ఇరాక్‌లో తీవ్రవాదులు, భద్రతా దళాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో... అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. 
 
దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 348 పాయింట్ల నష్టంతో 25,228కి పతనమైంది. నిఫ్టీ 108 పాయింట్లు కోల్పోయి 7,542కి పడిపోయింది.
 
ఇకపోతే ప్రిస్టేజ్ ఎస్టేట్స్, మదర్సన్ సుమి సిస్టమ్స్, కోల్గేట్ పామోలివ్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు లాభపడగా, జై ప్రకాష్ అసోసియేట్స్ , డీఎల్ఎఫ్, హెచ్ పీసీఎల్, హిందుస్థాన్ కాపర్ వంటి సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి.