స్టాక్ మార్కెట్ : లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

pnr| Last Updated: సోమవారం, 4 ఏప్రియల్ 2016 (17:14 IST)
బాంబే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ సోమవారం లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ సూచీ 130 పాయింట్లు లాభపడి 25,399 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 7,758 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.19 వద్ద కొనసాగుతోంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఐడియా సంస్థ షేర్లు అత్యధికంగా 6.21శాతం లాభపడి రూ.113.75 వద్ద ముగిశాయి.

వీటితోపాటు టాటా పవర్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అరబిందో ఫా సంస్థల షేర్లు లాభాలతో ముగిశాయి. అలాగే అంబుజా సిమెంట్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 1.64 శాతం నష్టపోయి రూ.231.50 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతి సంస్థల షేర్లు నష్టాలు గడించాయి.దీనిపై మరింత చదవండి :