శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (22:00 IST)

ఒకే ఒక కాలు.. స్కేటింగ్‌లో అదరగొట్టింది..

Skating
Skating
సంకల్ప శక్తి సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తుంది. లక్ష్యాలను సాధించి, సవాళ్లను జయించేలా చేస్తుంది. తాజాగా అర్జెంటీనా స్కేటింగ్ ఛాంపియన్ మిలీ ట్రెజోకు చెందిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అదీ కాస్త ఆన్‌లైన్‌లో ప్రజల హృదయాలను తాకింది. 
 
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మిలీ ట్రెజో అనే అమ్మాయి ఒక కాలు మాత్రమే కలిగి ఉంది. రింక్‌లో సులభంగా స్కేటింగ్ చేస్తోంది. ప్రేక్షకులు బిగ్గరగా చీర్ చేయడంతో అమ్మాయి తన చేతులను పైకి లేపి తన స్కేటింగ్‌పై దృష్టి సారించింది.
 
అమ్మాయి ఆ ఘనతను సాధించి, తన తల్లి వద్దకు వెళ్లి, ఆమెను హత్తుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆమెను వండర్ గర్ల్ అంటూ పిలుస్తున్నారు.