శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (18:08 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్.. అక్కపై వీనస్‌ను మట్టికరిపించి చెల్లాయి టైటిల్ కొట్టేసింది..

అమెరికా నల్ల కలువల సమరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో అక్కాచెల్లెళ్ల మధ్య తుది సమరం ఆసక్తికరంగా సాగింది. సింగిల్స్ ఫైనల్ పో

అమెరికా నల్ల కలువల సమరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో అక్కాచెల్లెళ్ల మధ్య తుది సమరం ఆసక్తికరంగా సాగింది. సింగిల్స్ ఫైనల్ పోరులో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ టైటిల్ గెలుచుకుంది. 
 
తన సోదరి వీనస్‌ విలియమ్స్‌తో జరిగిన టైటిల్‌ పోరులో సెరెనా 6-4, 6-4తేడాతో విజయం సాధించింది. దీంతో స్టోఫీగ్రాఫ్‌ పేరిట ఉన్న 22 టైటిళ్ల రికార్డును 35ఏళ్ల సెరెనా బ్రేక్ చేసింది. ఆద్యంతం ఆధిక్యత ప్రదర్శించిన సెరెనా మెరుగైన ఆటతీరుతో విజేతగా నిలిచింది. ఫలితంగా అక్క వీనస్‌ను మట్టికరిపించి చెల్లాయి.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
ఇకపోతే.. సెరెనాకు వీనస్‌పై మంచి రికార్డు ఉంది. చివరిగా వీరిద్దరూ 2009 వింబుల్డన్‌ ఫైనల్లో పోటీపడ్డారు. ఈ మ్యాచ్‌లో సెరెనాదే పైచేయి సాధించింది. అంతేగాకుండా వీనస్‌-సెరెనా మధ్య జరిగిన జరిగిన తొమ్మిది గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్ల పోరులో సెరెనా ఏడు టైటిల్స్ సొంతం చేసుకుంది. వీరిద్దరూ కలిసి 121 టైటిల్స్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఇందులో అత్యధికంగా సెరెనా 72 టైటిల్స్ తన ఖాతాలో వేసుకుంది.