సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 28 ఏప్రియల్ 2018 (14:34 IST)

ఆసియా బ్యాడ్మింటన్: సెమీఫైనల్లో అడుగెట్టిన సైనా నెహ్వాల్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సైనా 21-15, 21-13తో లీ జా

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సైనా 21-15, 21-13తో లీ జాంగ్ మి (కొరియా)పై అలవోకగా గెలిచి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గెలవడం ద్వారా సైనా నెహ్వాల్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నట్లైంది. 
 
మరో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో కామన్వెల్త్ రజత పతక విజేత పీవీ సింధు 19-21, 10-21తో సుంగ్ జీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోయి ఆసియా చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు పురుషుల బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్  పోరాటం క్వార్టర్ ఫైనల్స్‌లోనే ముగిసింది. పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాంత్ 12-21, 15-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.