గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (21:50 IST)

తల్లికాబోతున్న సానియా... ఇక టెన్నిస్‌కు టాటా?

హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమె తల్లికాబోతున్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఈ మేరకు సానియా దంపతులిద్దరూ తమతమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చే

హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమె తల్లికాబోతున్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఈ మేరకు సానియా దంపతులిద్దరూ తమతమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేసి ఈ న్యూస్ చెప్పారు.
 
భారత్‌కు చెందిన సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పటి నుంచి కుటుంబ నియంత్రణ పాటిస్తూ వచ్చిన వీరిద్దరూ ఇపుడూ తమ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. 
 
ఇటు మీర్జా, అటు మాలిక్, మధ్యలో మీర్జా మాలిక్ అంటూ ఓ కప్‌బోర్డ్ ఫొటో పోస్ట్ చేసి పరోక్షంగా తాను తల్లి కాబోతున్నాను అన్న మెసేజ్‌ను అభిమానులకు సానియా వెల్లడించింది. 
 
బేబీ మీర్జామాలిక్ అంటూ సానియా క్యాప్షన్ ఇవ్వడంతో ఆమె స్నేహితులు, బంధువులు కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఈ మధ్యే తనకు పుట్టబోయే పిల్లల ఇంటి పేరు మీర్జామాలిక్‌ గానే ఉండాలని తాము నిర్ణయించుకున్నట్లు సానియా చెప్పిన విషయం తెలిసిందే. 
 
తమకు కూతురే కావాలని కూడా ఈ జంట కోరుకుంది. అప్పుడే ఆమె తల్లి కాబోతున్నదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఇద్దరూ ఒకే రకమైన ఫొటోతో పరోక్షంగా ఆ వార్తలను ధృవీకరించినట్లు అయింది.