బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (18:31 IST)

రోజుకు 3.. ఒక్కో అథ్లెట్‌కు 34.. మొత్తం 2.25 లక్షల కండోమ్స్ పంపిణీ

మొత్తం 11 రోజుల పాటు జరిగే కామన్వెల్త్ క్రీడా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ 2018 క్రీడా పోటీలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి.

మొత్తం 11 రోజుల పాటు జరిగే కామన్వెల్త్ క్రీడా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ 2018 క్రీడా పోటీలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల కోసం వేలాది మంది క్రీడాకారులు, అధికారులు, ప్రేక్షకులు ఇప్పటికే గోల్డ్ కోస్ట్ చేరుకున్నారు. ఈ పోటీలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ముఖ్యంగా, ఈ క్రీడా పోటీల కోసం క్రీడాకారులతో పాటు సెక్స్ వర్కర్లు కూడా భారీ సంఖ్యలో ఇక్కడకు తరలిరానున్నారు. దీంతో వీరితో శృంగారంలో పాల్గొనేందుకు వీలుగా నిర్వాహకులు కండోమ్స్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ కండోమ్స్‌ను ఆటగాళ్లకు అందివ్వనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్య రక్షల కోసం వారికి లక్షల సంఖ్యలో కండోమ్స్ వారికి పంపిణి చేయనున్నారు. ఈ క్రీడా పోటీల కోసం దాదాపు 2.25 లక్షల కండోములు, 17 వేల టాయిలెట్ రోల్స్‌తో పాటు అందరికి ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిచనున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం 6,600ల మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. అంతే ఒక్కొ అథ్లెట్‌కి దాదాపు 34 కండోమ్స్ ఇవ్వనున్నారు. అంటే ఒక్కొ అథ్లెట్ రోజుకి మూడు కండోమ్స్ వినియోగించుకొవచ్చు.
 
తాజాగా ప్యాంగ్ చాంగ్ వేదికగా జరిగిన వింటర్స్ ఒలింపిక్స్‌లో నిర్వాహకులు అథ్లెట్లకి 1.10 లక్షల కండోమ్స్ పంపిణీ చేశారు. అయితే అత్యధికంగా రియో ఒలింపిక్స్‌లో అథ్లెట్లకి 4.50 లక్షల కండోమ్స్ పంపిణీ చేశారు. ఒలింపిక్స్ జరిగిన సమయంలో జికా వ్యాధి ప్రభావం ఉన్న కారణంగా ఎవరికి ఎటువంటి హాని జరుగకూడదనే ఉద్ధేశ్యంతో అప్పుడు అధికారులు ఈ పని చేశారు.