బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (15:46 IST)

షరపోవాపై నెగ్గిన బౌచర్డ్.. మాటలతోనే కాదు.. మ్యాచ్‌లోనూ షాక్ ఇచ్చింది..

మాడ్రిడ్ ఓపెన్ రెండో రౌండ్లో రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవాకు చుక్కెదురైంది. గతంలో షరపోవాను చీటర్ అని విమర్శించిన కెనడాకు చెందిన యుగేని బౌచర్డ్ ఆమెకు షాక్ ఇచ్చింది. సింగిల్స్ రెండో రౌండ్లో బ

మాడ్రిడ్ ఓపెన్ రెండో రౌండ్లో రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవాకు చుక్కెదురైంది. గతంలో షరపోవాను చీటర్ అని విమర్శించిన కెనడాకు చెందిన యుగేని బౌచర్డ్ ఆమెకు షాక్ ఇచ్చింది. సింగిల్స్ రెండో రౌండ్లో బౌచర్డ్‌ 7-5, 2-6, 6-4తో మరియాపై ఉత్కంఠ విజయం సాధించింది. 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవాకు మాడ్రిడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంపై బౌచర్డ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఇదే తంతును ఆటలోనూ చూపెట్టింది. మరియా షరపోవాపై ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. 
 
ప్రపంచ 60వ ర్యాంకర్‌ అయిన యుగేని గతంలో తాను మార్గదర్శిగా భావించిన షరపోవాతో పోరును ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఫలితంగా యుగేని గెలుపొందింది. ఓడినప్పటికీ షరపోవా యుగేనిని ప్రశంసలతో ముంచెత్తింది. కాగా, మరో మ్యాచలో కేథరినా సినియకోవాపై 6-2, 2-6, 7-5తో నెగ్గిన టాప్‌ సీడ్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌తో మూడో రౌండ్‌లో బౌచర్డ్‌ పోటీ పడనుంది.