శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (13:33 IST)

అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు గట్టి షాక్_ఫిఫా సస్పెండ్.. నెక్ట్స్ ఏంటి?

World Cup
World Cup
అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను ఫిఫా సస్పెండ్ చేసింది. దీంతో అండర్-17 మహిళల ప్రపంచకప్ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు గట్టి షాక్ తగిలింది. 
 
ఫిఫా నియమాలకు విరుద్దంగా థర్డ్ పార్టీల జోక్యం ఉన్నందున ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఫిఫా (FIFA) ప్రకటించింది. ఈ మేరకు  ఫిఫా అపెక్స్ బాడీ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. 
 
భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో సుప్రీంకోర్టు జోక్యంతో ఫిఫా ఈ చర్య తీసుకుంది. అండర్-17 మహిళల ప్రపంచకప్ అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై సస్పెన్షన్‌ మేఘాలు కమ్ముకున్నాయి. భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేసి విషయంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఫిఫా తెలిపింది. 
 
కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) రూపొందించిన టైమ్‌లైన్‌ను సుప్రీంకోర్టు ఆమోదించడంతో ఆగస్టు 13న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సీఓఏ ప్రతిపాదించిన షెడ్యూల్‌ ప్రకారం త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆగస్టు 3న సుప్రీంకోర్టు ఆదేశించింది.