శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (18:16 IST)

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికా వ్యోమగామి

raja chari
హైదరాబాద్ మూలాలు కలిగిన భారతీయ-అమెరికన్ వ్యోమగామి రాజా చారి భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులోభాగంగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో భారత జెండా చిత్రాన్ని పోస్ట్ చేశారు. 
 
భారతీయ అమెరికన్ వ్యోమగామి భారతదేశంతో కలిసి పనిచేయడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. దేశానికి 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన అభినందనలు తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), నాసా, సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.
 
ఐఎస్‌ఎస్‌లో ఆరు నెలలపాటు సేవలందించిన రాజా చారి మేలో, నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్‌ఎక్స్ అంతరిక్ష నౌక గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో విజయవంతంగా దూసుకుపోయింది. ఈ ప్రాజెక్టు కోసం పని చేసిన వారిలో రాజాచారి ఒకరు కావడం గమనార్హం.