1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:30 IST)

కామన్వెల్త్ నుంచి హాకీ ఇండియా అవుట్.. కఠిన క్వారంటైన్‌ కారణంగా?

ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకునే సంచలన నిర్ణయం తీసుకుంది.. హాకీ ఇండియా. 2022లో ఇంగ్లండ్‌లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌కు నుంచి వైదొలుగున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ నగరం కామన్ వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 
 
ఇంగ్లాండ్‌లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కఠినమైన కరోనా క్వారంటైన్ నిబంధనల కారణంగా కూడా హాకీ ఇండియా పర్యటనను రద్ధు చేసుకున్నారు.
 
ఇండియా నుంచి యూకే వెళ్లే వారు అక్కడ తప్పకుండా 10 రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇప్పడు ఆ నిబంధనే కామన్వెల్త్ టూర్‌కు ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు ఇదే కారణం చెబుతూ భువనేశ్వర్‌లో జరుగుతున్న పురుషుల జూనియర్ వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ తమ జట్టును పంపించలేదు. ఈ నిర్ణయం వెలువడిన రోజు తర్వాత హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.