బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (18:40 IST)

ఇండోనేషియా టోర్నీ : ఫైనల్‌కు చేరిన సైనా నెహ్వాల్

ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనోక్‌ ఇంతనాన్‌పై సైనా ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. 
 
మూడుసార్లు ఇండోనేషియా మాస్టర్స్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న మాజీ వరల్డ్ నం.1 సైనా.. తాజా గేమ్‌లో రట్చనోక్‌పై 21-19, 21-19 పాయింట్స్‌తో విజయం నమోదుచేసింది. 48 నిముషాల్లోనే ఆటను ముంగించేయడం గమనార్హం. 
 
ఫైనల్‌లో బ్యాడ్మింటన్ ప్రపంచ నెం.1 తాయ్ త్జుయింగ్‌తో గానీ, చైనీస్ ఎనిమిదో సీడ్ హే బింగ్జియావోతో గానీ తలపడనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సైనా 21-13, 21-19 స్కోరుతో వరుస గేముల్లో సింధుపై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.