బుధవారం, 15 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జనవరి 2025 (14:55 IST)

అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం : ఎంపీ కేశినేని చిన్ని

motera stadium
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని వెల్లడించారు. ఈ స్టేడియాన్ని అమరావతి స్పోర్ట్ సిటీలో నిర్మిస్తామని తెలిపారు. 
 
రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సహకారంతో ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ సీజన్-3 పోటీలను మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏసీఏ తరపున త్వరలో ఏపీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు. 
 
ఈ నెలాఖరులో విజయనగరంలో క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తామని తెలిపారు. రూ.50 కోట్లతో విశాఖపట్నం స్టేడియంలో ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంత్రి లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎనిమిది రకాల క్రీడా పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. 
 
దుబాయ్ కార్ రేసింగ్ పోటీలు : హీరో అజిత్ జట్టుకు మూడో స్థానం! 
 
తమిళ హీరో అజిత్ కుమార్ కొన్నిరోజులుగా దుబాయ్‌లో జరుగుతున్న దుబాయ్ 24 హెచ్ కార్ రేస్‌లో తన టీంతో కలిసి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆదివారం జరిగిన 24 హెచ్ కార్ రేసింగ్ పోటీల్లో అజిత్ టీం విజయాన్ని అందుకుంది. హోరా హోరిగా సాగిన ఈ రేసింగ్‌లో ఆయన టీం 901 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది. 
 
ఇటీవల జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా రేసులో పాల్గొని విజయం సాధించారు. దీంతో ఆయనకు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును అందించింది టీమ్. ఈ సందర్భంగా అజిత్‌కు పలువురు సినీ ప్రముఖుల సోషల్ మీడియాలో  అభినందనలు తెలుపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే.