సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (09:04 IST)

మనిక బత్రకు ఊహించని షాక్‌.. ఏమైందంటే?

భారత స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనిక బత్రకు ఊహించని షాక్‌ ఎదురైంది. సెప్టెంబర్‌ 28 నుంచి దోహాలో జరుగనున్న ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే భారత జట్టులో మనిక బత్రకు చోటు దక్కలేదు. 
 
ఆసియా చాంపియన్‌షిప్స్‌ జట్ల ఎంపిక బారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య సోనెపట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి మనిక బత్ర హాజరు కాలేదు. జాతీయ జట్టులో చోటు కోసం, శిక్షణ శిబిరం హాజరు తప్పనిసరి చేసిన సమాఖ్య.. ఈ మేరకు బత్రాను జట్టులోకి ఎంపిక చేయలేదు. 
 
మనిక బత్ర స్థానంలో వరల్డ్‌ నం.97 సుతీర్థ ముఖర్జీ మహిళల జట్టుకు నాయకత్వం వహించనుంది. టేబుల్‌ టెన్నిస్‌ దిగ్గజం చైనా ఈసారి ఆసియా చాంపియన్‌షిప్స్‌కు దూరంగా ఉంటోంది. 
 
దీంతో పురుషుల విభాగంలో భారత్‌ పతక అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. పుణెలో వ్యక్తిగత కోచ్‌ వద్ద శిక్షణ తీసుకుంటానని మనిక బత్ర చెప్పినా.. టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య జాతీయ శిక్షణ శిబిరానికి రావాలనే కచ్చితమైన నియమం విధించింది.