ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (15:25 IST)

వరల్డ్ చెస్ చాంపియన్‌ గుకేశ్‌కు ఖేల్ రత్న!

gukesh
ఇటీవల వరల్డ్ చెస్ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న అవార్డును ప్రకటించింది. అలాగే, స్టార్ షూటర్ మను బాకర్‌కు కూడా ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు దరఖాస్తు విషయమై మను బాకర్‌కు అవార్డుల కమిటీ మదఅయ వివాదం చెలరేగిన విషయంతెల్సిందే. 
 
అయితే, కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా 2024 సంవత్సరానికిగాను తమతమ క్రీడా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు నలుగురు క్రీడాకారులకు ఖేల్‌రత్నలు ప్రకటించింది. 
 
గుకేశ్‌తో పాటు మను బాకర్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్‌లకు కూడా కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అవార్డులను ప్రదానం చేయనున్నట్టు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటించింది. 
 
3 గంటలు ఆలస్యమైతే విమానం రద్దు.. ఎందుకో తెలుసా? 
ఉత్తర భారతావనిని పొగమంచు కమ్మేసింది. దీంతో అన్ని రకాల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా, విమాన, రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాతావరణం అధ్వాన్నంగా ఉన్న సమయంలో విమాన సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 
 
అధ్వాన వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న సమయాల్లో విమానయాన సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, తమ కార్యకలాపాల నియంత్రణ కేంద్రాల(ఓసీసీ)ను బలోపేతం చేసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. గత రెండు నెలలుగా విమానయాన సంస్థలు, విమానాశ్రయ ఆపరేటర్లతో మంత్రిత్వశాఖ వరుసగా చర్చలు జరిపాక తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
ఒక విమానం మూడు గంటలకు మించి ఆలస్యమైన పక్షంలో విమాన సర్వీసును రద్దు చేయాలని, ఆలస్యమైన విమానం లోపల ప్రయాణికులను 90 నిమిషాల కంటే ఎక్కువగా కూర్చోపెట్టరాదనీ, తద్వారా వారికి అసౌకర్యాన్ని తగ్గించొచ్చు. తర్వాత రీబోర్డింగ్ ప్రక్రియ సులభతరంగా ఉండేలా చూసుకోవాలని సూచన చేసింది. 
 
మంచు బారినపడిన విమానాశ్రయాల్లో సమర్థంగా సేవలను అందించడం కోసం క్యాట్ /క్యాట్ 3 సిబ్బందిని సరిపడా నియమించుకోవాలి. ఇందుకు డీజీసీఏతో విమానాశ్రయాలు సమన్వయం చేసుకోవాలని కోరింది. విమాన ప్రయాణికులతో కంపెనీలు సర్వీస్ ఆలస్యం, రద్దు అంశాల్లో సమాచారాన్ని సరిగ్గా పంచుకోవాలని స్పష్టం చేసింది.