శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (12:27 IST)

రియో ఒలింపిక్స్ : ఫ్లయింగ్ ఫిష్‌ ఫెల్ప్స్‌కు బంగారు పతకం

ఈత కొలనులో ఫ్లయింగ్ ఫిష్‌గా పేరుగాంచిన అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌కు మరో బంగారు పతకం వరించింది. ప్రస్తుతం రియోలో జరుగుతున్న విశ్వక్రీడల్లో 4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలో బంగారు పతకం సాధించి బోణి క

ఈత కొలనులో ఫ్లయింగ్ ఫిష్‌గా పేరుగాంచిన అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌కు మరో బంగారు పతకం వరించింది. ప్రస్తుతం రియోలో జరుగుతున్న విశ్వక్రీడల్లో 4X100 ఫ్రిస్టయిల్ ఈత పోటీలో బంగారు పతకం సాధించి బోణి కొట్టాడు. అతడికిది 19వ ఒలింపిక్ గోల్డ్ మెడల్ కావడం విశేషం. 2 రజతాలు, 2 కాంస్యాలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి.
 
ఈ పతకంతో ఈతలో తనకు తిరుగులేదని ఫెల్ప్స్ మరోసారి రుజువు చేశాడు. అంతేకాకుండా, 23వ ఒలింపిక్ పతకాన్ని గెలిచి తన రికార్డును మరింత పదిలపరుచుకున్నాడు. 'ఫ్లయింగ్ ఫిష్'గా ప్రఖ్యాతి గాంచిన ఈ 6 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న స్విమ్మర్ రియో ఒలింపిక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ ఏకంగా 8 స్వర్ణాలు గెలిచి ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే.