శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 ఆగస్టు 2016 (13:38 IST)

నా కల నెరవేరింది: సింధు :: రియోలో చక్కగా రాణించారు: గోపిచంద్‌

'ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న నా కల నెరవేరింది' అని రియో ఒలింపిక్స్‌ క్రీడల్లో రజత పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లో మరింత రాణిస్తానని తెలిపారు.

'ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న నా కల నెరవేరింది' అని రియో ఒలింపిక్స్‌ క్రీడల్లో రజత పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లో మరింత రాణిస్తానని తెలిపారు.
 
ఇకపోతే.. పీవీ సింధు కోచ్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ... రియో ఒలింపిక్స్‌లో ముగ్గురు క్రీడాకారులు చక్కగా రాణించారన్నారు. సత్తా చాటిన క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరింత రాణిస్తారని ఆశించారు. 
 
కాగా, రియో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... ఒక్కసారిగా స్టార్లుగా మారిపోయారు. ఇప్పటికే వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించగా... తాజాగా వారికి ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కూడా అందించారు. హైదరాబాదులోని పుల్లెల గోపీచంద్ అకాడెమీలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వారికి కార్లను అందించారు. 
 
ఇక సచిన్‌కు ఆహ్వానం పలికిన ముగ్గురు క్రీడాకారులు వేర్వేరు వస్త్రధారణలో కనువిందు చేశారు. తెలుగు తేజం పీవీ సింధు అచ్చం ఫ్యాషన్ ఐకాన్ లా తెలుపు రంగు డ్రెస్సులో మెరిసిపోయింది. సాక్షి మాలిక్ నల్లటి కోటుతో అచ్చమైన క్రీడాకారిణిగా కనిపించింది. ఇక జిమ్నాస్టిక్స్‌లో భారత్ సత్తా చాటిన దీపా కర్మాకర్ మాత్రం జీన్స్ ప్యాంట్, రెడ్ కలర్ టీ షర్ట్‌తో వస్తాదుకు మల్లే రెజ్లర్ లుక్‌లో కనిపించింది.