బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మే 2016 (17:43 IST)

కలం పట్టనున్న సానియా మీర్జా.. స్వీయచరితపై పుస్తకం.. జూలైలో రిలీజ్!

భారత క్రీడాకారిణి, హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కలం పడుతున్నారు. తండ్రి ఇమ్రాన్ మీర్జా సహకారంతో ‘ఏస్‌ ఎగైనెస్ట్‌ ఆడ్స్‌’ పేరుతో సానియా స్వీయచరితపై పుస్తకం రాస్తోంది. 16 ఏళ్లకే వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ డబుల్స్ టైటిల్స్ గెలిచి, ఇటు సింగిల్స్‌లోనూ.. అటు డబుల్స్‌లోనూ భారత నెంబర్ వన్ క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించుకుంది. 
 
2012లో సింగిల్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సానియా మీర్జా ఆ పై డబుల్స్ విభాగంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సానియా మీర్జా అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకుంది. గత ఏడాది టైటిల్స్‌పై టైటిల్స్ సాధించింది. 
 
హార్పర్‌ కాలిన్స్‌ ప్రచురణ సంస్థ పుస్తకాన్ని జులైలో సానియా మీర్జా స్వయంగా రాసే పుస్తకాన్ని విడుదల చేయనుంది. క్రీడాకారిణిగా ఉన్నత స్థాయికి చేరుకునే క్రమంలో సానియా ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంపై సానియా ఆ పుస్తకంలో పేర్కొంటారని తెలిసింది.