కొంచెం కూడా భయం లేదు.. ఎలా పల్టీ కొట్టిందో చూడండి.. (Video)

Last Updated: శనివారం, 31 ఆగస్టు 2019 (16:03 IST)
ఓ పాఠశాల విద్యార్థిని కొంచెం కూడా భయం లేకుండా.. పల్టీ కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిన్నారి వీడియోను చూసిన వారంతా ఈమె జిమ్నాస్టిక్ క్రీడాకారిణి నాడియాతో పోల్చేస్తున్నారు. గత రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో ఓ పాఠశాల క్రీడాకారిణి పల్టీ కొట్టే వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు.

ఈ వీడియోలోని చిన్నారి దేశంలోని ఏ పాఠశాలకు చెందిన చిన్నారి అనేది తెలియరాలేదు. కానీ కేంద్ర క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజు ఈ విద్యార్థినిని గుర్తించి.. సాయంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు తెలిపారు.

అంతేగాకుండా ఒలింపిక్ విజేత జిమ్నాస్టిక్ నాడియా కూడా ఈ వీడియోను షేర్ చేసి.. వీడియోలోని చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :