శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (13:46 IST)

సౌమ్యజిత్‌ ఘోష్‌పై రేప్ ఆరోపణలు... కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి తొలగింపు?

దేశ అగ్రశ్రేణి టేబుల్ టన్నిస్ ఆటగాడు, కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకం సాధిస్తాడని అంచనాలున్న సౌమ్యజిత్‌ ఘోష్‌పై కోల్‌కతాలోని బరాసత్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రేప్‌ కేసు దాఖలైంది.

దేశ అగ్రశ్రేణి టేబుల్ టన్నిస్ ఆటగాడు, కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకం సాధిస్తాడని అంచనాలున్న సౌమ్యజిత్‌ ఘోష్‌పై కోల్‌కతాలోని బరాసత్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రేప్‌ కేసు దాఖలైంది. 
 
భారత టెస్ట్ జట్టు క్రికెటర్ మహ్మద్‌ షమిపై అతడి భార్య హసీన్‌ జహా చేసిన వివాహేతర సంబంధాల ఆరోపణల దుమారం సద్దుమణగకముందే.. కోల్‌కతాకే చెందిన మరో భారత మేటి క్రీడాకారుడిపై ఏకంగా రేప్‌ కేసు నమోదు కావడం సంచలనం రేపింది. 
 
ఈ నేపథ్యంలో టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఘోష్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే భారత జట్టునుంచి అతడిని తొలగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు శుక్రవారం జరిగే టీటీఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. 
 
కాగా, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురికి చెందిన సౌమ్యజిత్‌ అత్యంత పిన్నవయస్సులో 2012 లండన్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు అత్యంత పిన్నవయస్సు (19 ఏళ్లు)లో జాతీయ టీటీ చాంపియన్‌గా నిలిచిన రికార్డూ సొంతం చేసుకొన్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.