శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (17:06 IST)

రికార్డు సృష్టించిన సునీల్ ఛత్రీ

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛత్రీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ వేసిన రెండో ఆటగాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ రికార్డు సుధీర్ఘకాలంగా లినోల్ మెస్సీ పేరిట ఉండేది. దీన్ని సునీల్ ఛత్రీ తన పేరిట లిఖించుకున్నాడు. 
 
తజికిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ ఛత్రీ 2 గోల్స్  వేయడం వల్ల ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. 34 యేళ్ళ ఛత్రీ ఇప్పటివరకు 70 గోల్స్ వేయగా, పోర్చుగీస్‌కు చెందిన క్రిస్టినో రోనాల్డ్ 88 గోల్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. దీనిపై సునీల్ ఛత్రీ స్పందిస్తూ, అరుదైన ఫీట్‌ను సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.