శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (12:09 IST)

యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి రోహన్ బోపన్న జోడీ.. రికార్డ్ అదుర్స్

Rohan Bopanna
Rohan Bopanna
గ్రాండ్ స్లామ్ హోదాతో కూడిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇందులో భాగంగా పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌లో భారత జోడీ అదరగొట్టింది. భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్, ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ మహత్, పియరీ హ్యూగ్స్ హెర్బర్ట్‌తో తలపడ్డారు. 
 
ఇందులో బోపన్న జోడీ 7-6 (7-3), 6-2తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరిన జంటగా రికార్డు సృష్టించింది. 13 ఏళ్ల తర్వాత రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ లో ఫైనల్స్‌కు దూసుకెళ్లడం విశేషం.