లగడపాటి సర్వే ఉత్తుత్తిదే.. ఎవరు..?
తెలంగాణా ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల క్రితం తిరుమల వేదికగా స్వతంత్ర్య అభ్యర్థులే ఎక్కువగా ఈసారి తెలంగాణా రాష్ట్రంలో గెలిచే అవకాశం ఉందని వారే కింగ్ మేకర్లుగా మారుతారని కూడా లగడపాటి జోస్యం చెప్పారు. రెండు పేర్లను కూడా వెల్లడించారు.
ఆ తరువాత తన సర్వే వివరాలను వెల్లడించారు. ఈసారి తెలంగాణా రాష్ట్రంలో ప్రజా కూటమి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉందని, టిఆర్ఎస్ లోని కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అభివృద్థి చేయకపోవడంతోనే టిఆర్ఎస్ నేతలను ఈసారి ఎన్నుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేశారని లగడపాటి సర్వేను విడుదల చేశారు.
ఈ సర్వే రెండు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. 2009 సంవత్సరం నుంచి లగడపాటి ఇస్తున్న సర్వేలన్నీ కరెక్టుగానే ఉన్నాయి. దీంతో విశ్లేషకులు కూడా ఇదే నిజమంటూ నమ్మకానికి వచ్చేశారు. లగడపాటి సాధారణంగా సర్వే చేయడమంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 25 మంది ఓటర్లతో మాట్లాడటం, అలాగే ఎంపి సీట్లకు సంబంధించి 70 వేల ఓటర్ల నాడిని తెలుసుకుని ఆ తరువాత సర్వేను విడుదల చేస్తారు. కానీ ఈసారి తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం లగడపాటి అదంతా చేయలేదట. ఉత్తుత్తి సర్వే చేశారంటూ ఆయన సన్నిహితులే చెబుతున్నారట. ఈసారి వందసీట్లు తెలంగాణాలో టిఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమంటున్నారు.