సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: బుధవారం, 5 డిశెంబరు 2018 (15:25 IST)

కేటీఆర్‌తో చాటింగ్‌ను బయటపెట్టిన లగడపాటి

మంత్రి కేటీఆర్‌తో సెప్టెంబర్‌లో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను మాజీ మంత్రి లగడపాటి బయటపెట్టారు. చంద్రబాబు ఒత్తిడితో లగడపాటి సర్వే ఫలితాలను మార్చారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. లగడపాటి స్పందించారు. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రమే మాట్లాడతానని చెప్పిన లగడపాటి.. కేటీఆర్ వ్యాఖ్యలతో ముందే మీడియా ముందుకు వచ్చారు. 
 
సెప్టెంబర్ 16న బంధువుల ఇంట్లో కేటీఆర్ తనను కలిశారని చెప్పారు. 23 నియోజకవర్గాల్లో ప్రజానాడి ఎలా ఉందో చెప్పాలని కేటీఆర్ తనను రిక్వెస్ట్ చేశారని, దాంతో ఉచితంగానే సర్వే చేసి నవంబర్ 11న కేసీఆర్‌కు వాట్సాప్ ద్వారా రిపోర్ట్ పంపించానన్నారు. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, అభ్యర్థులను మార్చకపోతే నష్టం వచ్చే అవకాశం ఉందని తాను కేటీఆర్‌కు ముందే చెప్పానని లగడపాటి తెలిపారు.