గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (09:25 IST)

ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ కూర్పుపై రేవంత్ రెడ్డి చర్చ..

revanth reddy
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో సమావేశం కానున్నారు. గురువారం తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లారు. 
 
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. 
 
బుధవారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. మరోవైపు గురువారం ఉదయం 10.28 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.