శుక్రవారం, 4 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : సోమవారం, 1 జూన్ 2015 (12:05 IST)

చంద్రబాబును అరెస్ట్ చేయండి: టీఆర్‌ఎస్ నేతల డిమాండ్..

ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్ రెడ్డి, స్టీఫెన్‌తో చర్చ సమయంలో పలుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావన వచ్చిందని... అందువల్ల, వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. స్టీఫెన్‌తో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో తన పరిమితి రెండున్నర కోట్లేనని, మిగిలిన డబ్బు బాస్ దగ్గర తీసుకోవాలని, అవసరమైతే ఏపీలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని అనడం స్పష్టంగా తెలుస్తోందని, ఇందంతా చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని ఆరోపించారు. 
 
ఇదే విషయమై మరో విపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కేవలం పావు మాత్రమే అని, అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఇది అత్యంత హేయమైన చర్య అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగినా ఇది అత్యంత దారుణమైన చర్య అని, చంద్రబాబును అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.