సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మే 2024 (11:21 IST)

ఫేస్‌ను, ఫోటో ఐడీని చెక్ చేసే హక్కు నాకుంది.. ఆ ఇద్దరి ఓటు..?

Madhavi Latha
బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై స్పందించారు. పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద మాట్లాడుతూ.. తాను చాలా వినమ్రతగా అమ్మా, మీ ఫేస్... ఫొటో ఐడీని చెక్ చేసుకోండి.. అని వారిని రిక్వెస్ట్ చేశానని అడిగానని చెప్పారు. 
 
ఆ సమయంలో తాను ఫేస్‌ను, ఫొటో ఐడీని చూశానన్నారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు.
 
హైదరాబాద్​ పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీ లత తమ సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీనికి కారణం మాధవీ లత నివాసం ఈస్ట్​మారేడుపల్లిలో మహేంద్రహిల్స్​‌లో ఉండటమే. దీంతో ఇది మల్కాజిగిరి నియోజకవర్గంలోకి వస్తుంది. ఫలితంగా ఈమె తన ఓటును తనకు వేసుకోలేకపోయారు. 
 
మరోవైపు హైదరాబాద్​ ఎంపీ, ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నివాసం రాజేంద్రనగర్​ పరిధిలో ఉంది. ఈ ప్రాంతం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆయన హైదరాబాద్ ​పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన కూడా తన ఓటును తనకు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. చేవెళ్ల ప్రాంతంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎవరూ బరిలో లేరు. దీంతో తన ఓటును వేరొకరికి వేయాల్సిన పరిస్థితి నెలకొంది.