బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (10:59 IST)

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన హరీష్ రావు (Video)

harish rao lunch with students
భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ మాజీ మంత్రి హాస్టల్లో ఉన్న సమస్యలఫై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కూడా తమ సమస్యలను మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

హాస్టల్లో మెను పాటిస్తున్నారా, సరైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి వరుస క్రమంలో నిల్చొని భోజనం పెట్టించుకుని విద్యార్థులతో కలిసి ఆరగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.