మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (12:25 IST)

రాగ్‌రూట్‌లో వచ్చి కారు ఢీకొని సీఐ దుర్మరణం.. ఎక్కడ?

sadhik ali
హైదరాబాద్ నగరంలోని ఎల్పీ నగర్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీ దుర్మరణం పాలయ్యారు. అలాగే, ఎస్.ఐ. కాజావలీకి గాయాలయ్యాయి. మంగళవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాద వార్తలను పరిశీలిస్తే, 
 
ఎల్బీ నగర్‌లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతి చెందారు. ఎస్.ఐ కాజావలీ మొహినుద్దీన్ గాయాలపాలయ్యారు. సాధిక్ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తుండగా, కాజావలీ నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు. 
 
మలక్‌పేట క్వార్టర్స్‌లో ఉండే వీరిద్దరూ మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్ళి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు వినుషా శెట్టి అనే పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డెంజర్ డ్రైవింగ్, చలాన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రమాదం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ కారును ఆపకుండా వెళ్లిపోయినట్టు సమాచారం.