గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2024 (11:32 IST)

సమ్మక్క సారక్క గద్దెల వద్ద భూప్రకంపనలు.. వీడియో వైరల్

Sammakka Sarakka Gaddela
Sammakka Sarakka Gaddela
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురి చేశాయి. ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 
 
తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదు అని.. అటువంటింది 5.3 తీవ్రతతో భూమి కంపించటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సమ్మక్క సారక్క గద్దెల వద్ద భూ ప్రకంపనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామంలో భూ ప్రకంపనలకు రేకుల ఇల్లు గోడ కూలింది.