బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (18:47 IST)

గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాయం

MBBS student
MBBS student
తెలంగాణలో కొమరం భీమ్ జిల్లా జైనూర్ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆర్థిక సాయం అందించారు. సాయిశ్రద్ధకు ఎంబీబీఎస్ సీటు రావడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కాలేజీ ఫీజు చెల్లించలేదు. 
 
ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి డాక్టర్ కావాలనే ఆ బాలిక కలను నెరవేర్చే బాధ్యతను ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం అందించారు. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103వ ర్యాంకు సాధించింది. 

ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఓ యువతి వైద్యురాలు కావాలనే ఆశయంతో ఎంతో కష్టపడి చదివింది. చివరికి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం వచ్చింది. తన లక్ష్యానికి చేరుకునేందుకు ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడకు చెందిన మెస్రం జ్ఞానేశ్వర్, లక్ష్మి దంపతులకు శుభం, సాయి శ్రద్ధ ఇద్దరు సంతానం. జ్ఞానేశ్వర్ టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని కొడుకు, కూతురిని చదివిస్తున్నారు. కొడుకు శుభం బీటెక్ చదివి గేట్ పరీక్షకు సిద్ధం అవుతున్నాడు.