ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (12:14 IST)

ఆ 100 మంది పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో రేవంతన్న!

revanth
దేశంలోని 100 మంది పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చోటు దక్కింది. 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (39వ స్థానంలో నిలిచారు. 
 
ఈ జాబితాలో ప్రముఖులు, క్రీడాకారులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు ఉన్నారు. అలాగే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు.
 
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మూడో స్థానంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 39వ స్థానంలో ఉండగా, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 56వ స్థానంలో ఉన్నారు. 
 
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ 16వ స్థానంలో, సోనియా గాంధీ 29వ స్థానంలో, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 36వ స్థానంలో ఉన్నారు. ప్రియాంక గాంధీ 62వ స్థానంలో ఉన్నారు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ 38వ స్థానంలో ఉన్నారు.