Tablet Strip In Chicken Biryani: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం (video)
Tablet Strip In Chicken Biryani: బిర్యానీలో పురుగులు, జెర్రిలు దర్శనమిస్తుంటాయి. నిన్నటికి నిన్న బిర్యానీలో బొద్దింక కనిపించింది. తాజాగా బిర్యానీ తిందామని మొదటిసారి బావర్చి రెస్టారెంట్‌కు వచ్చిన ఒక కస్టమర్‌కు బిర్యానీలో ఏకంగా టాబ్లెట్ స్ట్రాప్ ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగు తిన్న కస్టమర్ బావర్చి బిర్యాని యాజమాన్యాన్ని నిలదీశాడు.
తాను బిర్యానితో పాటు మెడిసిన్‌ని కూడా తింటున్నాను.. అంటూ వీడియో తీశాడు. ఇది ఏ మెడిసినో చెప్పాలి అంటూ బావార్చి యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ఒక మెడిసిన్ స్టాప్ బిర్యానీలో ఎలా వచ్చిందని కస్టమర్ ప్రశ్నిస్తూ వీడియో తీశాడు. దీనికి బావార్చి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ కస్టమర్ పైనే చిందులు వేశారు.
కాగా హైదరాబాద్‌కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే కచ్చితంగా బిర్యాని తిని వెళుతుంటారు. అందులోనూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే బావర్చి బిర్యానీ అంటే తెలియని వారు ఉండరు. బావర్చి బిరియానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన బావర్చి బిర్యానీపై అభిప్రాయాన్ని మార్చేస్తుంది.