గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2024 (23:00 IST)

దేశ్ కా ట్రక్ ఉత్సవ్‌‌లో హైదరాబాద్‌లోని వినియోగదారులకు సాధికారత కల్పించిన టాటా మోటార్స్

Tata Motors
భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ 2024, అక్టోబర్ 18న హైదరాబాద్‌లో రోజంతా జరిగేలా దేశ్ కా ట్రక్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్‌లోని ట్రక్కింగ్ కమ్యూనిటీని వారికి పనికొచ్చే సూచనలతో బలోపేతం చేయడానికి రూపొందించబడింది. టాటా మోటార్స్ తాజా శ్రేణి ట్రక్కులు, వాల్యూ యాడెడ్ సర్వీసెస్‌తో స్వీయ అనుభవం... ఇవన్నీ కూడా లాభదాయకతను పెంపొందించడం, యాజమాన్యం యొక్క తక్కువ మొత్తం ఖర్చు(TCO)ని అందించడం లక్ష్యంగా ఉన్నాయి.
 
ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు తమ ఫ్లీట్ పనితీరును మెరుగుపరచడం, ఇంధన సామర్థ్యాన్ని అధికం చేసుకోవడం, ఎక్కువ లాభదాయకతను సాధించడంపై నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందుకుంటారు. వారు చక్కటి వివరణలతో కూడిన వాహన ప్రదర్శనలు, టాటా మోటార్స్ సమగ్ర విక్రయానంతర సేవల మద్దతుపై వివరణల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. ఇందులో వాహన నిర్వహణ కార్యక్రమాలు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, వార్షిక నిర్వహణ ప్యాకేజీలు, సంపూర్ణ సేవా 2.0 కార్యక్రమం ద్వారా 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లాంటివి ఉంటాయి. కొనుగోలుదారులకు వారి ఫ్లీట్‌లతో దీర్ఘకాలిక విజయాన్ని అందించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి వీలుగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. అంతేగాకుండా కంపెనీ కీలకమైన కస్టమర్‌లను వారి భాగస్వామ్యం, మద్దతు కోసం గౌరవిస్తుంది. వాహనంతో ఓవరాల్ అనుభవాన్ని మరింత ప్రతిఫలం అందించేదిగా చేస్తుంది.
 
ఈ సందర్భంగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్(ట్రక్స్) శ్రీ రాజేష్ కౌల్ మాట్లాడుతూ, ‘‘కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించేందుకు టాటా మోటార్స్ కట్టుబడి ఉంది. దేశ్ కా ట్రక్ ఉత్సవ్ మా తాజా డిజిటల్ సొల్యూషన్స్‌ను హైలైట్ చేస్తూ వారితో నేరుగా నిమగ్నమవ్వడానికి ఒక కీలక వేదికను అందిస్తుంది. ఈ కార్యక్రమం మా పటిష్ఠమైన ట్రక్ శ్రేణి, విలువ-ఆధారిత సేవలను ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా, కస్టమర్ల దీర్ఘకాలిక లాభదాయకత, విజయంపై వారి వాస్తవ-ప్రపంచ ప్రభావాన్ని తెలియజేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. మా అత్యాధునిక ఉత్పత్తులు కస్టమర్‌ల వ్యాపారాలను భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా చేసేందుకు వీలుగా రూపొందించబడ్డాయి. మారుతున్న పరిస్థితులలో అవి ముందుండేలా చేస్తాయి. మా సహకారాన్ని బలోపేతం చేయడానికి, భాగస్వామ్య విజయాన్ని సాధించడానికి మా కస్టమర్లు, భాగస్వాములతో పరస్పర సంభాషణలు చేయడానికి మేం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.