బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (13:33 IST)

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజున రూ.500కే సిలిండర్

gas cylinder boy
ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగున్నాయి. ఆ రోజున మహాలక్ష్మి పథకం కింద అంజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం విధి విధానాలను ఖరారు చేస్తుంది. మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
 
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు ఎంతమంది, ఎవరెవరికి ఈ పథకం వర్తింపజేయాలనేది నిర్ణయించనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంతనేది లెక్కలు తీస్తున్నారు.
 
ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెల నెలా 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులు అందరికీ సబ్సిడీ ఇస్తే ఖజానాపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడనుందని అంచనా. అయితే, రాష్ట్రంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లు సుమారుగా 70 లక్షలు ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి 'నేమ్ ఛేంజ్' ఆప్షన్ ఉండడంతో మిగతా వినియోగదారులు పేరు మార్చుకునే సౌలభ్యం ఉంది. ఈ క్రమంలోనే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి విధి విధానాలను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.