నేను ఏదో ఒకరోజు తెలంగాణ సీఎం అవుతా, వారి తాట తీస్తా: కల్వకుంట్ల కవిత
తను ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాననీ, ఆ అవకాశం వచ్చినప్పుడు అవినీతి నాయకుల తోలు తీస్తానని హెచ్చరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ నాయకుల్లో వున్న గుంటనక్కలే తనను విమర్శిస్తున్నాయనీ, తాను ఇంకా చిట్టా విప్పకుండానే ఉలిక్కిపడుతున్నారంటూ విమర్శించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం ఒక్కొక్కరి జాతకాలు బైటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.
హరీశ్ రావును విమర్శిస్తుంటే భాజపా నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు, ఆయనకు మీకు సంబంధం ఏమిటి. మాధవరం కృష్ణారావుపై నాకేమీ కోపం లేదు. అవినీతి, అక్రమాలకు ఆయన కొడుకు పాల్పడుతున్నారు, దానికి ఆయన సమాధానం చెప్పాలి. నేను ఇప్పటివరకూ అవినీతి ద్వారా ఒక్క పైసా కూడా ఆర్జించలేదు. బతుకమ్మ పండగ వస్తే నా నగలు కుదువపెట్టి పండగ చేసాను అంటూ చెప్పారు కవిత.