1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (08:49 IST)

ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్ల పాలు!! రాపిడో డ్రైవర్ తీసుకెళుతుండగా...

praja palana applications
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఇందులోభాగంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు... ఎన్నికల హామీల అమలు కోసం చిత్త శుద్ధితో కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలనలో భాగంగా హామీల అమలు కోసం ప్రత్యేకంగా దరఖాస్తులను ముద్రించింది. వీటిని అర్హులైన అభ్యర్థుల కోసం అందచేస్తుంది. 
 
అయితే, ఇపుడు ఈ దరఖాస్తులు రోడ్లపాలవుతున్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలు కొనుగోలు చేశాయి. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ రోడ్ల పాలయ్యాయి. ప్రజా పాలన అప్లికేషన్లు ఆన్‌లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన అధికారులు.
 
హయత్ నగర్ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు కూకట్‌పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా.. ఓ వ్యక్తి రాపిడో వాహనం మీద అట్టపెట్టెలో తీసుకువెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులు అన్నీ రోడ్ మీద పడటంతో ప్రజలు చూసి ఖంగుతుని ఇవి నీ చేతుల్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆ డ్రైవర్ చెప్పిన సమాధానం ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో పోలీసులకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ దరఖాస్తు చేసున్న వారిలో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసిన మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంట గ్యాస్, రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి యేటా ఎకరానికి రూ.15 వేల నగదు, ఇందిర్మ్ ఇండ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, అమర వీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం వంటి పథకాలను అమలు చేస్తారు.