బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (12:52 IST)

షాకింగ్ వీడియో.. టిప్పర్ లారీ కింద పడిన బైకు.. మంటలు.. వ్యక్తికి తీవ్రగాయాలు.. (video)

Lorry
Lorry
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ దగ్ధమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైకుపై ఉన్న దశరథ్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలైనాయి. ఆయనను ఆస్పత్రికి తరలించారు. తూప్రాన్‌కు చెందిన మర్యాల దశరథ 12వ వార్డు బీడీ కాలనీ ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన అవసరం నిమిత్తం బైకుపై వస్తున్నాడు. 
 
నర్సాపూర్ చౌరస్తా వద్దకు రాగానే వేగంగా వచ్చిన టిప్పర్ ఎదురుగా వచ్చి బైకును ఢీకొంది. దీంతో దశరథ కిందపడిపోయాడు. అతని కాళ్లపై నుంచి టిప్పర్ చక్రాల ద్వారా వెళ్లడంతో తీవ్రగాయాలైనాయి. 
 
ఆ వెంటనే కింద పడిన బైకులోంచి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రుడిని 108లో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.