సోమవారం, 3 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2025 (10:54 IST)

నైరుతి వైపు ఉపరితల ఆవర్తనం-తెలంగాణలో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు

Rains
నైరుతి వైపు ఉపరితల ఆవర్తనం కార‌ణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు వ‌ల్ల వర్షాలు కురిసే అవ‌కాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివ‌ల్ల కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 
 
సముద్ర ఉపరితలంలోని 8 కి.మీ స‌ర్క్యులేషన్ వల్ల బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు తెలంగాణ మీద కలిసి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 2,463 గ్రామాలు వర్షాలకు ప్రభావితం అయ్యాయని.. 2,20,443 ఎకరాలు దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది. ఏకంగా 1,43,304 మంది రైతులు వానలకు నష్టపోయారని పేర్కొంది. 
 
ఇకపోతే.. తెలంగాణలో సెప్టెంబర్‌ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.