బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (08:59 IST)

త్వరలోనే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ : మంత్రి పొంగులేటి

ponguleti srinivasa reddy
త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలంగాణ రాష్ట్ర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే సూచనలు ఉన్నాయని చెప్పారు. 
 
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వస్తారని భావిస్తున్నానన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన నేతగా సభకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. మేడ్చల్, రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను త్వరలో విప్పుతామని హెచ్చరించారు.
 
లగచర్ల కేసులో అరెస్టయిన జైల్లో ఉన్న రైతును ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో బేడీలు వేయడం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. అదానీ విషయంలో ఇక వివాదం వద్దని... ఆయన ఇచ్చిన రూ.100 కోట్లను తమ ప్రభుత్వం వెనక్కి ఇచ్చిందని స్పష్టం చేశారు. 
 
హాస్టళ్లకు పెండింగ్ బిల్లులను ఈ నెల 31వ తేదీ లోగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. 
 
మరోమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకు రావాలన్నారు. ప్రతి సభ్యుడు సభ విలువను కాపాడాలని, ప్రజాస్వామ్యయుతంగా చర్చకు రావాలన్నారు. శాసనసభ, మండలిలో సమర్థవంతంగా ప్రజల అంశాలు చర్చకు రావాలన్నారు.
 
ప్రజల కోసం ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అది నెరవేరే విధంగా సభ్యులంతా సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య విలువలకు శాసనసభ వేదిక అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.