సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (22:32 IST)

కీలక పోస్టుకి ఐఏఎస్ ఆమ్రపాలిని ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం

Amrapali
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదీలీలు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలికి కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) కమీషనర్ బాధ్యతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్.డిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతకుమారి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు.
 
అలాగే ఆరోగ్యశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యార్, ట్రాన్స్ కో అండ్ జెన్ కో చైర్మన్ అండ్ ఎమ్.డిగా రిజ్వీ, అగ్రికల్చర్ డైరెక్టర్‌గా గోపీ, టీఎస్ఎస్పిడీసిఎల్‌గా ముషారఫ్ అలీ, టీఎస్పీడీసీఎల్ సీఎండిగా వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఓస్డిగా ఐఏఎస్ కృష్ణభాస్కర్, ట్రాన్స్ కో జెఎండీగా సందీప్ కుమార్ లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.