మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (22:38 IST)

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)

beat
ఇటీవలికాలంలో కొందరు ఉపాధ్యాయులు కామబుద్ధితో ప్రవర్తిస్తున్నారు. తమ వద్ద చదువుకునే విద్యార్థినిలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు... విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారికి విద్యార్థుల తల్లిదండ్రులు తగిన శాస్తి చేస్తున్నారు. 
 
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడుకి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. 
 
తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడి బాగోతాన్ని తల్లిదండ్రుల దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. దీంతో పలువురు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. వీరిని చూడగానే పాఠశాల ప్రహరీగోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా, అందరూ చుట్టుముట్టడంతో వారికి చిక్కిపోయాడు. 
 
ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను పలువురు మహిళలు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.