శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (10:52 IST)

కుమారుడి పుట్టినరోజు.. బంగారు గొలుసు కోసం మహిళ ఆత్మహత్య

victim woman
కుమారుడి పుట్టినరోజు చేయలేదనే మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెట్ బషీరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెట్ బషీరాబాద్ - సుభాష్ నగర్‌లో నరసింహారెడ్డి, నాగ సత్యవేణి దంపతుల చిన్నకుమారుడు జ్ఞానేశ్వర్ పుట్టినరోజుకు బంగారు గొలుసు చేయించి వేడుకలు చేద్దామని భర్తను భార్య కోరగా.. భర్త పట్టించుకోలేదు. 
 
ఇంకా తర్వాత చూద్దామనడంతో మనస్తాపానికి గురైన నాగ సత్యవేణి ఆత్మహత్యకు పాల్పడింది. వారం రోజుల పాటు భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. 
 
మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.