గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జులై 2023 (14:26 IST)

ఫలక్‌నుమా రైల్లో మంటలు... తగలబడిన మూడు బోగీలు

train catch fire
హౌరా - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోని రైలులోని మూడు బోగీలు మంటల్లో కాలిపోయాయి. బీబీ నగర్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగాయి. ఏకంగా ఆరు బోగాలకు మంటలు అంటుకోగా, వాటిలో నాలుగు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. 
 
ఈ రైలు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు చైను లాగి కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.