సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (20:23 IST)

తెలంగాణలో ప్రతీ స్కీం వెనుక ఓ స్కాం: లక్ష్మణ్

రాష్ట్రంలో  ప్రతి  స్కీం  వెనుక…  ఓ  స్కాం  ఉందని  విమర్శించారు  బీజేపీ  రాష్ట్ర  అధ్యక్షుడు లక్ష్మణ్.  రెండోసారి  అధికారంలోకి  వచ్చాక  కేసీఆర్  పాలనను గాలికొదిలేసారని  మండిపడ్డారు.  రాష్ట్రంలోని  ఏ పథకానికి  సరైన  నిధులివ్వటం  లేదన్నారు.  బంగారు  తెలంగాణ  పేరుతో  రాష్ట్రాన్ని  అప్పుల తెలంగాణగా  మార్చారని  ఆగ్రహం  వ్యక్తం  చేశారు  లక్ష్మణ్.
 
కాళేశ్వరాన్ని మానస పుత్రికగా చెప్పుకొనే కేసీఆర్ రూ.30వేల కోట్ల ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు పెంచి 6 శాతం కమీషన్ దండుకున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో కమీషన్ తీసుకుంటున్నారన్న లక్ష్మణ్.. చంద్రబాబును బూచిగా చూపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని సీరియస్ అయ్యారు.
 
రూ.500 కోట్లు వృథా చేసి అసెంబ్లీ కడతామంటూ చెబుతున్న కేసీఆర్‌.. ఆరోగ్యశ్రీ బకాయిలు మాత్రం చెల్లించట్లేదన్నారు. బస్తీల్లో పేదలు డెంగీ, మలేరియా వ్యాధులతో మంచాన పడితే పట్టించుకునేవారే  లేరని.. ప్రభుత్వం జారీ చేసే జీవోలు వెబ్‌ సైట్‌ లో పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

శనివారం ఉమ్మడి  కరీంనగర్  జిల్లా  పర్యటనకు  వచ్చిన  లక్ష్మణ్,  మాజీ  ఎంపీ వివేక్  వెంకటస్వామిని  స్థానిక  నేతలు  ఘనంగా  సన్మానించారు.