మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (09:04 IST)

అబ్కారీ ఎస్సై - కానిస్టేబుల్‌ను చితకబాదిన తాగుబోతులు

తెలంగాణా రాష్ట్రంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసేందుకు వెళ్లిన అబ్కారీ (ఎక్సైజ్) శాఖ ఎస్.ఐ., కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పురానీపేట శివారులో జరిగింది. 
 
ఈ ప్రాంతంలో నాటుసారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీల కోసం ఎస్.ఐ నర్సింహులు, కానిస్టేబుల్‌ వెంటబెట్టుకుని వళ్లారు. ఆసమయంలో అక్కడ మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, ఓ తాగుబోతును పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విడిపించేందుకు మిగిలిన ముగ్గురు తాగుబాతులో ఎస్.ఐ, కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాది, ఆ నలుగురు తప్పించుకుని పారిపోయారు. అబ్కారీ శాఖ ఎస్.ఐ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.