బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (19:23 IST)

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు: 8మంది అరెస్ట్

murder
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత కక్షలతో పక్కా ప్లాన్‌ ప్రకారమే నిందితులు కృష్ణయ్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజైన ఆగష్టు 15వ తేదీన కృష్ణయ్యను దారుణంగా చంపి పారిపోయినట్లు తెలిపారు. 
 
ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసి ఖమ్మం సెషన్స్ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు పోలీసులు.  
 
ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి మూడు బైకులు, ఆటో, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.