బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (13:44 IST)

తల్లీకూతుళ్లను బలి తీసుకున్న అక్రమ సంబంధం

నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో ఓ అక్రమ సంబంధం తల్లీకూతుళ్లను బలి తీసుకుంది. అనంతసాగర్‌కు చెందిన జుర్రు సాయిలు(46)కు 1996లో రేగోడు మండలం చౌదర్‌పల్లికి చెందిన అనసూయ(40)తో వివాహం జరిగింది.

గతంలో భార్యపై అనుమానంతో.. ఈ విషయాన్ని సాయిలు అనసూయ తల్లి విఠమ్మకు చెప్పాడు.. ఈ సమయంలో అత్తకు, అల్లుడికి గొడవ జరిగింది. ఆ సమయంలో రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్‌ ఎంఐజీ కాలనీలో నివాసం ఉండే విఠమ్మను సాయిలు తన సోదరుడు రాములుతో కలిసి దారుణంగా హత్య చేశాడు.

ఈ కేసులో అప్పట్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. కొంతకాలం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా పెద్దల మధ్యవర్తిత్వంతో తిరిగి కాపురం సజావుగా సాగుతున్నప్పటికీ అనసూయపై అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో అనసూయ కొన్నాళ్లపాటు భర్త నుంచి వేరుగా ఉంది.

నెల రోజుల కిందట పెద్దలతో రాజీ ప్రయత్నంతో సాయిలు ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించి బుధవారం అర్ధరాత్రి దారుణంగా హత్యచేసి ఠాణాలో లొంగిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి స్కూటీ, హత్యకు వినియోగించిన చాకును స్వాధీనం చేసుకుని జహీరాబాద్‌ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై సందీప్‌ తెలిపారు.